.

రోజా

ఈమధ్యకాలంలో జగన్ వర్గనేతల్లో కార్యకర్తలకు రోజా ప్రధానఆకర్షణగా నిలిచారు. టిడిపి నుంచి బయటకు వచ్చి వైఎస్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన తరువాత ఆమె రాజకీయాల జోలికి రాలేదు.అడపాదడపా సినిమాల్లోనూ, టివి ప్రోగ్రామ్స్‌లో నటిస్తూ కాలక్షేపం చేశారు. అయితే ఆమె ఇటీవల చాలా సన్నబడ్డారని, గ్లామర్ పెంచేశారని,మునుపటిలా హీరోయిన్ మాదిరిగా వచ్చేశారని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఓసారి విలేకర్లలో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు ఒకాయన మీరెందుకు బాగా సన్నబడుతున్నారని, మళ్లీ మొదటి గ్లామర్ రావడానికి కారణాలేమైనా ఉన్నాయని అడిగితే ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నేను పదేళ్లగా ముసలిపార్టీగా ఉన్న టిడిపిలో ఉన్నాను కాబట్టి అప్పటికి తగ్గట్టుగా తయారయ్యాయని, ఇప్పుడు యువకుడు, తన కంటే చిన్నవాడైన జగన్‌పార్టీలో చేరాను కాబట్టి ఈ యువ పార్టీకి తగ్గట్టుగా తయారవుతున్నానని ఆమె చెప్పడం విశేషం. అయితే ఆమె వాయిస్ మాత్రం అప్పటిమాదిరిగా అంతజోష్‌ లేదని ,అప్పటిలో ఆమె ప్రసంగాలుకు ఉన్నంత క్రేజీ ఈమధ్య ప్రసంగాలకు రావడం లేదని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇంకో విషయమేమిటంటే వైఎస్‌ను తెగతిట్టి ఇప్పుడు మళ్లీ దివంగత కుమారుడు పార్టీలోకి ఎలా వచ్చారని ప్రశ్నిస్తే, నేను పార్టీ ధర్మాన్ని నిర్వర్తించానని, అప్పట్లో వైఎస్ పథకాల వల్ల పేదలకు జరిగిన మేలును గుర్తించలేకపోయానని చెప్పుకొచ్చారు. చివరగా నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సైనికురాలుగా
edit post
0 Response to 'రోజా ఎందుకు సన్నబడింది'

Post a Comment